తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మేడ్చల్​లో రెండు ఇళ్లలో దొంగతనం - theft in tow houses in medchal news

మేడ్చల్ పట్టణంలో రాఘవేంద్ర నగర్ కాలనీలోని రెండు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. 13.5 తులాల బంగారం, రూ. 2.5లక్షల నగదు, వెండి సామాను దొంగిలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

theft in tow houses in medchal malkajgiri district
మేడ్చల్​లో రెండు ఇళ్లలో దొంగలు చోరీ

By

Published : Jan 15, 2021, 9:17 PM IST

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్ పట్టణంలో రాఘవేంద్ర నగర్ కాలనీలోని రెండు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని హైటెక్ స్కూల్ పక్కన తాళం వేసి ఉన్న రెండు ఇళ్లల్లో తాళం పగలగొట్టి దొంగతనం చేశారు.

ఒక ఇంట్లో నుంచి 13.5 తులాల బంగారం, రూ. 2.5లక్షల నగదు.. మరో ఇంట్లో నుంచి వెండి సామాను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి... క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

ఇదీ చూడండి: పండుగ మిగిల్చిన విషాదం.. గాలిపటమే యమపాశం!

ABOUT THE AUTHOR

...view details