తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పాతబస్తీలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగులు - హైదరాబాద్ నేర వార్తలు

హైదరాబాద్​లోని పాతబస్తీలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. చంద్రాయణగుట్ట పోలీస్​స్టేషన్​ పరిధిలోని జహంగీరాబాద్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి చొరబడి డబ్బు, బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Theft in old city hyderabad in chandrayanagutta police station limits
పాతబస్తీలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగులు

By

Published : Nov 7, 2020, 10:55 PM IST

హైదరాబాద్ పాతబస్తీలోని ఓ ఇంట్లో దోపిడి దొంగలు చోరీకి పాల్పడ్డారు. చంద్రాయణగుట్ట పోలీస్​స్టేషన్​ పరిధిలోని జహంగీరాబాద్ ప్రాంతానికి చెందిన సయ్యద్ హుస్సేన్​ పెళ్లి చేసుకునేందుకు లాతుర్ వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చేసరికి సామానులు చెల్లాచెదురుగా పడి ఉండడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇంట్లో ఉన్న ఐదు వేల రూపాయల నగదు, 8 గ్రాముల బంగారు చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు వెల్లడించాడు. ఇంటి పైకప్పు రేకు తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్​ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.

ఇదీ చూడండి:తాళంవేసి ఉన్న ఇళ్లే లక్ష్యం... ముగ్గురు దొంగలు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details