తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఒకే మొబైల్​ దుకాణంలో వరుసగా రెండుసార్లు చోరీ.. - మెదక్​లో మొబైల్​ దుకాణంలో దొంగతనం

మెదక్​ జిల్లా కాళ్లకల్​లోని ఓ మొబైల్స్​ దుకాణంలో వరుసగా రెండుసార్లు గుర్తుతెలియని వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డారు. ఖరీదైన ఫోన్లు, బ్యాటరీలను అపహరించాడు.

theft in mobile shop at kallakal in medak district
ఒకే మొబైల్​ దుకాణంలో వరుసగా రెండుసార్లు చోరీ..

By

Published : Nov 10, 2020, 9:56 AM IST

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ ప్రధాన రహదారిపై ఉన్న మొబైల్ దుకాణంలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి షాపులో చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి.

చరవాణీల దుకాణం పైకప్పు రేకులను తొలగించి మరీ దుకారణం చొరబడి ఫోన్లు, బ్యాటరీలు మొత్తం సుమారు రూ. 20 వేల విలువ చేసే వస్తువులు ఎత్తుకెళ్లాడు. అదే మొబైల్ దుకాణంలో ఈ ఏడాదిలో ఇది రెండోసారి చోరీ జరగడం గమనార్హం. దుకాణదారు ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:ఆన్‌లైన్ మోసం: ఏకంగా రూ.5.75 లక్షలకు టోకరా!

ABOUT THE AUTHOR

...view details