తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఇంటి తాళం పగలగొట్టి చోరీ చేసిన దొంగలు - etv bharath

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్​ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు.

Theft in mahabubabad district
ఇంటి తాళం పగలగొట్టి చోరీ చేసిన దొంగలు

By

Published : Sep 13, 2020, 10:35 AM IST

తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్​ చేస్తున్నారు దొంగలు. మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్​ కాలనీలో ఓ ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని శ్రీనివాస్​కు కరోనా సోకడం వల్ల ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పది రోజులుగా ఇంట్లో ఎవరు ఉండడం లేదు.

తాళం వేసి ఉండడం గమనించిన దొంగలు ఇంటి తాళం పగులగొట్టి ... బీరువాలోని నగదును ఎత్తుకెళ్లారు. ఇంటి తాళం పగలగొట్టి ఉండటాన్ని చూసిన ఇరుగు పొరుగు వారు శ్రీనివాస్​కు సమాచారం అందించారు. శ్రీనివాస్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:అలీని ఫాలో అయిన దొంగలు.. డ్యామిట్ కథ అడ్డం తిరిగింది!

ABOUT THE AUTHOR

...view details