మేడ్చల్ పట్టణంలోని సూర్యనగర్ కాలనీలో సోమవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకేసారి 6 ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు.
దోపిడీ దొంగల బీభత్సం... ఒకేసారి 6 ఇళ్లలో చోరీ - telangana varthalu
దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. మేడ్చల్ పట్టణంలోని ఓ కాలనీలో ఒకేసారి 6 ఇళ్లలో దొంగతనం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దోపిడీ దొంగల బీభత్సం... ఒకేసారి 6 ఇళ్లలో చోరీ
తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని దొంగలు విరుచుకుపడ్డారు. ఇళ్లలో భారీగా నగదు, విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా దొంగల ఆగడాలు మాత్రం ఆగటం లేదు.
ఇదీ చదవండి: కారు అద్దాలు పగులగొట్టి చోరీ.. పోలీసుల దర్యాప్తు