నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. హౌసింగ్ బోర్డ్ బీసీ కాలనీలో నివాసముంటున్న చక్రపాణి కుటుంబం... 2 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఊరికి వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం వేళ ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించిన పక్కింటి వాళ్ళు... యజమానులు వచ్చారేమో అనుకున్నారు. ఎందుకైనా మంచిదని చక్రపాణికి ఫోన్ చేసి వచ్చారోలేదో కనుక్కోగా... రాలేదని సమాధానమిచ్చారు.
తాళం వేసున్న ఇంట్లో చోరీ... 6 తులాల బంగారం అపహరణ - theft news
రెండు రోజుల క్రితం తాళం వేసి ఇంటి యజమానులు ఊరెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తాళం పగులగొట్టి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. పక్కింటివాళ్లు సమాచరమివ్వగా... ఇంటికి చేరుకుని చూసేసరికి ఏమీ మిగల్లేదు. చేసేదేమీ లేక పోలీసులకు సమాచారమిచ్చారు.
ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని సమాచారమివ్వగా... హుటాహుటిన ఊరునుంచి ఇంటికి చేరుకున్నారు. లోపలికి వెళ్లి చూడగా... రెండు బీరువాలు తెరిచి ఉన్నాయి. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడం వల్ల దొంగలు పడినట్లు నిర్ధరించుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఆరు తులాల బంగారం, పదిహేను తులాల వెండి, 5 వేల నగదు పోయినట్లు బాధితులు చెబుతున్నారు. గతంలోనూ ఇదే కాలనీలో పలు ఇళ్లలో చోరీ జరగటం వల్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు.