తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బ్యాంకులోని నగదు, ఆభరణాలతో అటెండర్​ పరారీ..! - chori in east godavari district news update

కెనరా బ్యాంకు శాఖలో అటెండర్ నగదు, బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడిన ఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో చోటు చేసుకుంది. సిబ్బంది మధ్యాహ్న భోజనానికి వెళ్లిన సమయంలో అటెండర్ సురేశ్​ సీసీ టీవీలను ఆఫ్ చేసి నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

theft-in-canara-bank-at-kottapeta-east-godavari-district
బ్యాంకులోని నగదు, ఆభరణాలతో అటెండర్​ పరారీ..!

By

Published : Dec 8, 2020, 7:48 PM IST


ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట కెనరా బ్యాంకు శాఖలో నగదు, బంగారం మాయం కావడం సంచలనం రేపుతోంది. 9 లక్షల 24వేల నగదుతో పాటు 322 గ్రాముల బంగారం మాయమైనట్లు మేనేజర్ శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సిబ్బంది భోజనానికి వెళ్లిన సమయంలో నగదు, బంగారం మాయమైనట్లు గుర్తించారు.

అదే రోజు ఖాతాదారులు జమ చేసిన నగదు, తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు క్యాష్ కౌంటర్​లో పెట్టారు. తాళాలు వేసుకొని వెళ్తూ.. అక్కడే అటెండర్​గా పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగి బండారు తులసి సురేశ్​​కు అప్పగించారు. తిరిగి వచ్చేసరికి సురేష్ కనిపించకపోవటం, ఫోన్ స్విచాఫ్ రావడం, బ్యాంక్​లో జమ చేసిన నగదు బంగారు ఆభరణాలు కనిపించకపోవటంతో.. మేనేజర్ శివ కుమార్ సీసీటీవీ ఫుటేజ్​ను పరిశీలించారు. అటెండర్ సురేష్​నే సీసీ టీవీలను ఆఫ్ చేసినట్లు గుర్తించారు. అటెండర్ సురేశ్​పై అనుమానం ఉన్నట్లు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమలాపురం డిఎస్పీ మాధవ రెడ్డి, రావులపాలెం సీఐ వి.కృష్ణ, కొత్తపేట ఎస్సై కె.రమేశ్​ సంఘటనా స్థలానికి చేరుకొని పలు వివరాలను సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి:ఇంట్లోంచి యువతి అదృశ్యం.. పోలీసులకు తండ్రి ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details