ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఒక విత్తనాల దుకాణంలో చోరీ జరిగింది. పట్టణంలోని టీబీ రోడ్డు వద్ద ఉన్న అన్నదాత వ్యవసాయ విత్తనాల దుకాణంలో లక్ష రూపాయల నగదు దొంగతనానికి గురైంది. ఈ ఘటనపై యజమాని హరికృష్ణ రెడ్డి ఫిర్యాదు మేరకు ఆళ్లగడ్డ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆళ్లగడ్డలో చోరీ... రూ.లక్ష అపహరణ - AP Crime News
ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దొంగతనం జరిగింది. పట్టణంలోని ఒక వ్యవసాయ విత్తనాల దుకాణంలో లక్ష రూపాయలు అపహరణకు గురయ్యాయి. పోలీసులు దుకాణంలోని సీసీ ఫుటేజీని పరిశీలించగా... గుర్తుతెలియని వ్యక్తి లోనికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆళ్లగడ్డలో చోరీ... రూ.లక్ష అపహరణ
విచారణలో భాగంగా దుకాణంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక అగంతకుడు దుకాణం తలుపులు తెరుచుకుని లోపలికి ప్రవేశించి చోరీ చేస్తుండటం కనిపించింది. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు.
ఇదీ చదవండి:మావోయిస్టుల ఆగడాలకు కళ్లెం వేసేందుకు పటిష్ఠ చర్యలు