ఏపీ విశాఖలోని ఆక్కయ్యపాలెం సమీపంలోని ఓ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దుండగులు.. మొత్తం అరవై తులాల బంగారం, కిలోన్నర వెండిని దోచేశారు. వాటి విలువ దాదాపు రూ.40 లక్షల వరకు ఉంటుందని చోరీకి గురైన యజమాని బంగార్రాజు తెలిపారు. సొంతంగా ఇల్లు కొనుగోళు చేసేందుకు.. బ్యాంకు నుంచి డ్రా చేసిన సొమ్మును ఇంటిలో ఉంచినట్లు వివరించారు.
ఇంట్లో చోరీ..రూ.40 లక్షల విలువైన బంగారు నగలు అపహరణ - విశాఖ జిల్లా ఆక్కయ్యపాలెం వార్తలు
ఏపీ విశాఖ జిల్లా ఆక్కయ్యపాలెంలో చోరీ జరిగింది. తాళం వేసిన ఇంట్లోకి దొంగలు చొరబడి బీరువాలో ఉన్న సుమారు రూ.40 లక్షల విలువైన నగలు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇంట్లో చోరీ..రూ.40 లక్షల విలువైన బంగారు నగలు అపహరణ
వీటిని గమనించిన వ్యక్తులే చోరీకి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే ఆస్తమయం