యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ శేఖర్ రెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. ఛైర్మన్ ఇంటికి కొద్ది దూరంలోనే ఉన్న తన అన్న రాజిరెడ్డి ఇంట్లో నిర్వహించిన శుభకార్యానికి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం ఇంటికి తాళం వేసి వెళ్లారు. సాయంత్రం వచ్చేసరికి ఆగంతుకులు తాళాలు పగులగొట్టి గదిలోని బీరువాలో దాచిన రెండున్నర తులాల బంగారు, 15 తులాల వెండి ఆభరణాలు, రూ.50 వేల నగదు, మూడు రోజుల క్రితం రూ.10 వేలతో కొనుగోలు చేసిన చరవాణి దోచుకెళ్లారు.
సహకార సంఘం ఛైర్మన్ ఇంట్లో చోరీ.. రెండున్నర తులాల బంగారం అపహరణ
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ ఇంట్లో చోరీ జరిగిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్‌లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.
సహకార సంఘం ఛైర్మన్ ఇంట్లో చోరీ
దొంగలను గుర్తించేందుకు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను ఎస్సై ఎండీ.ఇద్రిస్ అలీ పరిశీలిస్తున్నారు. క్లూస్ టీంతో ఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. ఛైర్మన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఇద్రీస్అలీ తెలిపారు.
ఇదీ చదవండి:గల్ఫ్‌లో నిర్మల్ జిల్లా వాసి మృతి
TAGGED:
Etv bharat news