తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తాండూరు ఐబీలో చోరీ.. బంగారం, వెండి మాయం - telangana news

తాండూరు ఐబీలో ఓ కుటుంబం శుభకార్యానికి వెళ్లి వచ్చే సరికి వారి ఇంటి తలుపులు తెరిచే ఉండడంతో అవాక్కయ్యారు. హుటాహుటిన లోపలికి వెళ్లి చూస్తే అంతా చిందరవందరగా ఉంది. 2 తులాల బంగారం, 20 తులాల వెండి, 20 వేల రూపాయలు చోరీకి గురయ్యాయని గమనించి.. పోలీసులని ఆశ్రయించారు.

theft at thanduru ib in mancherial district
తాండూరు ఐబీలో చోరి.. బంగారం, వెండి మాయం

By

Published : Dec 20, 2020, 3:36 PM IST

మంచిర్యాల జిల్లా తాండూరు ఐబీలో ఓ ఇంట్లో చోరి జరిగింది. ఐబీ ప్రాంతానికి చెందిన మేడి సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి కుమురం భీం జిల్లా బెజ్జురులో ఓ శుభకార్యం కోసం వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ఆ కుటుంబం ఇంటికి రాగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 2 తులాల బంగారం, 20 తులాల వెండి, 20 వేల రూపాయలు చోరీకి గురయ్యాయని బాధితులు చెప్పారు.

ఇంట్లో లేని సమయం చూసి దుండగులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తాండూరు ఎస్ఐ శేఖర్ దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతి

ABOUT THE AUTHOR

...view details