తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

శ్రీ చిత్ర గుప్త దేవాలయంలో చోరీ - Theft at Sri Chitra Gupta Temple Hyderabad

శ్రీ చిత్ర గుప్త దేవాలయంలో చోరీ జరిగిన ఘటన హైదరాబాద్ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని కందికల్ గేట్ సమీపంలో చోటుచేసుకుంది. ఆలయంలో ఉన్న హుండీ డబ్బు మాయమైనట్లు పోలీసులు గుర్తించారు.

శ్రీ చిత్ర గుప్తా దేవాలయంలో చోరీ
శ్రీ చిత్ర గుప్తా దేవాలయంలో చోరీ

By

Published : Aug 17, 2020, 2:14 PM IST

హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధి కందికల్ గేట్ ప్రాంతంలో శ్రీ చిత్ర గుప్త దేవాలయంలో చోరీ జరిగింది. రోజు మాదిరిగా ఆలయాన్ని తెరవడానికి వెళ్లిన పూజారికి ముఖద్వార తాళం పగలగొట్టి ఉండటం గమనించారు. వీటితో పాటు 5 హుండీలు సైతం ధ్వంసమై ఉన్నాయి.

పూజారి ఈ విషయాన్ని ఆలయ కమిటీకి తెలిపారు. హుండీల్లో దాదాపు రూ. 80 వేల నగదు దొంగతనానికి గురైనట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details