తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నిర్మల్​ జిల్లాలో వరుస దొంగతనాలు... ఓ ఇంట్లో భారీ చోరి.. - Nirmal District news

నిర్మల్​ జిల్లా తరోడ గ్రామానికి చెందిన షేక్ మొయినుద్దీన్ ఇంట్లో దొంగలు పడ్డారు. 5 తులాల బంగారం... 20 తులాల వెండి, లక్ష 75వేల నగదును అపహరించారు.

Theft at Mudhol, Nirmal District
నిర్మల్​ జిల్లాలో వరుస దొంగతనాలు... ఓ ఇంట్లో భారీ చోరి..

By

Published : Jul 28, 2020, 5:28 PM IST

నిర్మల్​ జిల్లా ముధోల్​ మండలంలో రెండు రోజులుగా వరుసగా దొంగతనాలు జరిగాయి. ఆదివారం రాత్రి... ముధోల్​లో ఒక మొబైల్​ షాప్​ చోరీ జరిగింది. మళ్లీ సోమవారం రోజు రాత్రి తరోడ గ్రామానికి చెందిన షేక్ మొయినుద్దీన్ ఇంట్లో దుండగులు దొంగతనానికి పాల్పడి 5 తులాల బంగారం... 20 తులాల వెండి, లక్ష 75వేల నగదును అపహరించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. తన సోదరి కొత్త ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న డబ్బులు, బంగారం, వెండిని ఎవరో ఎత్తుకెళ్లారని.. బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి సోదరి ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఈ చోరీ జరిగిందని వెల్లడించారు.

ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

ABOUT THE AUTHOR

...view details