ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పట్ట పగలే దొంగతనం జరగడం కలకలం రేపింది. గణేష్ నగర్లో అద్దెకు ఉంటున్న కుమ్ర రాజు అనే వ్యక్తి ఇంటి తాళం పగులగొట్టిన దొంగలు చోరీకి పాల్పడ్డారు.
తాళం వేసిన ఇంటికి కన్నం వేసిన దొంగలు - adilabad district latest news
ఆదిలాబాద్ పట్టణంలో పట్టపగలే జరిగిన దొంగతనం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. తాళం పగులగొట్టిన దొంగలు ఐదు లక్షల నగదు, రెండున్నర తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారని బాధితుడు వాపోయాడు.
జిల్లా కేంద్రంలోని గణేశ్ కాలనీలో అద్దెకు ఉంటున్న కుమ్ర రాజు కుటుంబంతో కలిసి వ్యవసాయ పనుల కోసం సొంతూరుకు వెళ్లాడు. ఊరు నుంచి ఇంటికి చేరుకున్న సమయంలో తలుపులు తీసి ఉండటాన్ని గమనించిన రాజు స్థానికులకు సమాచారం అందించడంతో చోరీ విషయం వెలుగు చూసింది. బీరువాలో దాచిన ఐదు లక్షల నగదు, రెండున్నర తులాల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారని బాధితుడు వాపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:లాఠీఛార్జ్ చేసిన సీఐపై హత్యాయత్నం కేసు పెట్టాలి: బండి