ఆదిలాబాద్ పట్టణ శివారు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న చాముండేశ్వరీ ఆలయంలో భారీ చోరీ జరిగింది. పట్టపగలే ఆలయంలోకి చొరబడ్డ ఇద్దరు దుండగులు.. తొలుత హుండీ పగులగొట్టే యత్నం చేసి విఫలమయ్యారు. అనంతరం గర్భ గుడిలోకి ప్రవేశించి.. అమ్మవారి కిరీటం, వెండి కళ్లు, మెడలోని ఆభరణాలు దోచుకెళ్లారు.
లైవ్ వీడియో: చాముండేశ్వరీ ఆలయంలో చోరీ.. సీసీటీవీలో నిక్షిప్తం - Chamundeshwari temple Theft video
ఆదిలాబాద్ పట్టణ శివారులోని చాముండేశ్వరీ ఆలయంలో చోరీ జరిగింది. పట్టపగలే ఆలయంలోకి చొరబడ్డ దుండగులు.. అమ్మవారి కిరీటం, వెండి కళ్లు, మెడలోని ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
లైవ్ వీడియో: చాముండేశ్వరీ ఆలయంలో చోరీ.. సీసీటీవీలో నిక్షిప్తం
సాయంత్రం పూజకు వచ్చిన భక్తులతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. చోరీ దృశ్యాలు ఆలయ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: హైదరాబాద్లో కిడ్నాప్ చేశారు.. జగిత్యాలలో పోలీసులకు చిక్కారు..