భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఏడో నెంబర్ మద్యం దుకాణంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. దొంగతనం జరిగిన విషయాన్ని రాత్రి గమనించిన దుకాణదారుడు ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రూ.20 వేల విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అధికారులు ఘటనా స్థలికి చేరుకుని దుకాణాన్ని పరిశీలించారు.
మద్యం దుకాణంలో చోరీ.. - wine shop
ఇల్లందులోని ఓ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. దుండగులు రూ. 20 వేల విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు దుకాణదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మద్యం దుకాణంలో చోరీ..