ఖమ్మం జిల్లా మధిరలో ఓ వైద్యుని ఇంట్లో చోరీ జరిగింది. ప్రభుత్వాసుపత్రిలో వైద్యునిగా పనిచేస్తున్న అనిల్ కుమార్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 2,40,000 నగదు ఎత్తుకెళ్లారు.
వైద్యుని ఇంట్లో చోరీ.. రూ.2.4 లక్షలు అపహరణ
మధిర సుందరయ్య నగర్లోని వైద్యుడి ఇంట్లో చోరీ జరిగింది. స్థానిక ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో వైద్యునిగా పనిచేస్తున్న డాక్టర్ అనిల్ కుమార్ ఇంట్లో చొరబడిన దుండగులు 2,40,000 నగదు ఎత్తుకెళ్లారు.
వైద్యుని ఇంట్లో చోరీ.. నగదు అపహరణ
మధిర సీఐ వేణుమాధవ్, ఎస్ఐ ఉదయ్ కుమార్ ఘటనా స్థలిని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.