తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తండ్రి మందలించాడని.. యువతి ఆత్మహత్య - nagar kurnool district latest news

తండ్రి మందలించాడని మనస్తాపానికి గురైన ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లాలో చోటుచేసుకుంది.

The young woman committed suicide due to reprimanded by her father
తండ్రి మందలించాడని.. యువతి ఆత్మహత్య

By

Published : Dec 12, 2020, 5:10 AM IST

నాగర్​కర్నూల్ జిల్లా పదర మండలం వంకేశ్వరంలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి మందలించాడని మనస్తాపానికి గురై.. గౌరీ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన కృష్ణయ్య, వెంకటమ్మ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి మూడో కూతరు గౌరీ ఇటీవలే ఇంటర్​ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. శుక్రవారం తమ పొలంలోని పత్తి ఏరడానికి రమ్మని తండ్రి పిలవగా.. దానికి కూతురు అంగీకరించలేదు. దీంతో తండ్రి కూతురిని మందలించి పొలానికి వెళ్లాడు.

తీవ్ర మనస్తాపానికి గురైన గౌరీ ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. గమనించిన చుట్టు పక్కల వారు తల్లిదండ్రులకు సమాచారం అందించి.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువతి మృతి చెందిందని వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ విషయంపై స్థానిక ఎస్సైని వివరణ కోరగా.. తమ దృష్టికి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

ఇదీ చూడండి: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.. రైతు మృతి

ABOUT THE AUTHOR

...view details