తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆవేదన: 'అయినవాళ్లే వేధించారు.. పోలీసులు దుర్భాషలాడారు'

ఆడపడుచులకు అండగా దిశ చట్టం తెచ్చినా...అమలులో మాత్రం వారి పాలిట శాపంగా మారుతోంది. మగువను కాపాడాల్సిన పోలీసులే..వారి పట్ల అసభ్యంగా ప్రవరిస్తూ... ఏడిపించిన వాళ్లకే అండగా నిలబడుతున్నారని ఓతల్లి ఆవేదన వ్యక్తం చేసిన ఘటన ఏపీ నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

the-young-woman-committed-suicide-at-kavali in nellore district
బంధువుల వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యాయత్నం

By

Published : Oct 13, 2020, 5:19 PM IST

ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని విష్ణాలయం వీధిలో కాపురం ఉంటున్న ఓ యువతి డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. మేనమామ, వారి బంధువుల వేధింపులు భరించలేక... ఒకటో పట్టణ పోలీసుస్టేషనులో కేసు పెట్టేందుకు వెళ్లింది.

ఆమె పట్ల ఎస్సై కొండయ్య దుర్భాషలాడటం వల్ల... ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తన బిడ్డ పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లి కోరుతోంది.

ఇదీ చదవండి:నిజంగా బంగారు ఆభరణాలు కొట్టుకుపోయాయా.. ?

ABOUT THE AUTHOR

...view details