ములుగు జిల్లా రాయినిగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. రాయినిగూడేనికి చెందిన దెబ్బకట్ల రవి మంగళవారం సాయంత్రం పొలం పనుల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా.. బుగ్గ ఒర్రె దాటుతున్న క్రమంలో నీటమునిగి గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు.
పొలం నుంచి వస్తుండగా.. వరదలో కొట్టుకుపోయి యువకుడి మృతి - young man died in mulugu district
పొలం పనులు చేయడానికి వెళ్లిన ఓ యువకుడు ఇంటికి తిరిగి వస్తుండగా వరదలో కొట్టుకుని గల్లంతైన సంఘటన ములుగు జిల్లా రాయినిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు గాలింపు చేపట్టగా.. బుధవారం ఉదయం యువకుని మృతదేహం లభ్యమయింది.
రదలో కొట్టుకుపోయి యువకుడి మృతి
స్థానికుల గాలింపుతో.. బుధవారం ఉదయం రవి మృతదేహం లభ్యమయింది. పొలం పనులు కోసం వెళ్లిన రవి విగత జీవిగా తిరిగిరావడం చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
- ఇదీ చదవండి :వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతల పర్యటన