తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అమ్మాయిని కలిసేందుకు వచ్చి అనంతలోకాలకు - nizamabad district crime news

అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్​లోని అంబేడ్కర్ కాలనీలో జరిగింది. అమ్మాయిని కలిసేందుకు వచ్చిన యువకుడు మృత్యవాత పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

The young man suspicious death in nizamabad district
అమ్మాయిని కలిసేందుకు వచ్చి అనంతలోకాలకు

By

Published : Sep 10, 2020, 12:48 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్​లోని అంబేడ్కర్ కాలనీ వద్ద బైపాస్ రోడ్డుపై ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. నందిపేట్​ మండలం కంఠం గ్రామానికి చెందిన సందీప్​ అమ్మాయిని కలిసేందుకు బోధన్​కు వచ్చారు.

రాత్రి 2 గంటల ప్రాంతంలో అతని బాబాయ్​తో ఫోన్​లో మాట్లాడారు. వారు కంఠం నుంచి వచ్చేసరికి రహదారిపై శవమై కనిపించాడని మృతుని బాబాయ్​ తెలిపారు. చంపేసి రోడ్డుపై పడేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:కలిసి జీవించలేక... వేర్వేరుగా బతకలేక... ప్రేమజంట ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details