మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండలో విషాదం చోటుచేసుకుంది. శివారు నాగులకుంటలో పడి గాలి ఓ యువకుడు మృతి చెందాడు. గమనించిన స్థానికులు మృతుడు సూర్యాపేట జిల్లా బాలెం గ్రామానికి చెందిన గాలి ప్రవీణ్(26)గా గుర్తించారు.
బహిర్భూమికని వెళ్లి.. అనంతలోకాలకు - mahabubabad district crime news
బహిర్భూమికని వెళ్లిన యువకుడు.. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రవీణ్ కొద్ది రోజుల క్రితం కందికొండలోని తమ బంధువల ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో శనివారం బహిర్భూమికి వెళ్లిన ప్రవీణ్.. ప్రమాదవశాత్తు కాలు జారి నాగులకుంట చెరువులో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మృతుడు గాలి ప్రవీణ్ సూర్యాపేట జిల్లాలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు సమాచారం.
ఇవీ చూడండి:విద్యాసంస్థల పునఃప్రారంభంపై త్వరలోనే నిర్ణయం : మంత్రి హరీశ్