తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భర్తను హత్య చేయించిన భార్య.. అందుకు అడ్డొస్తున్నాడనే..

ఏపీలోని గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరుకు చెందిన ఓ మహిళ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని తన భర్తనే హత్య చేయించింది. నగల తయారీకి వాడే సైనైడ్ ఉపయోగించి కడతేర్చింది. దీనికోసం ఆమె హంతకులకు రూ.10 లక్షలు సుపారీ ఇచ్చింది.

The wife who murdered her husband said she was facing an extramarital affair in ap guntur district
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించిన భార్య

By

Published : Nov 28, 2020, 6:30 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరుకు చెందిన బ్రహ్మయ్య చిన్నపాటి హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తుండేవాడు. ఈనెల 4వ తేదిన బ్రహ్మయ్య తన ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన సమయంలో.. ఇద్దరు దుండగులు అడ్డుకుని ముఖంపై రసాయనం చల్లారు. వెంటనే సమీపంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు. వారు ఆసుపత్రికి తరలించేలోపే బ్రహ్మయ్య చనిపోయాడు. దీనిపై పెదకూరపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం, పోలీసు జాగిలాలతో ఆధారాల కోసం జల్లెడ పట్టారు. అయితే అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో బ్రహ్మయ్య భార్య సాయికుమారిపై ఆరా తీశారు. ఆమెకు అశోక్ రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అశోక్ రెడ్డిని పట్టుకుని దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.

బ్రహ్మయ్యను అడ్డు తొలగించుకునేందుకు అతని భార్య సాయికుమారితో కుట్ర పన్నినట్లు తేలింది. హత్య కోసం కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు బ్రహ్మయ్య భార్య రూ. 10 లక్షలు సుపారీ ఇచ్చింది. హత్య చేసిన పవన్ కుమార్, షేక్ షరీఫ్​లతో పాటు సూత్రధారులు సాయికుమారి, అశోకరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బ్రహ్మయ్యను హత్య చేసేందుకు బంగారు ఆభరణాల తయారీలో ఉపయోగించే సెనైడ్ ను వాడారు. సాధారణంగా ఈ రకం సెనైడ్​ను ఆభరణాల మెరుగు కోసం వినియోగిస్తారు. అక్రమ సంబంధం వల్లనే హత్య జరిగిందని.. సుపారీ కోసం నిందితులు హత్యకు పాల్పడ్డారని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. హత్యకు ముందు నిందితులు ఇద్దరూ రెక్కీ కూడా నిర్వహించినట్లు చెప్పారు.

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించిన భార్య

బ్రహ్మయ్య భార్య ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. అశోక్ రెడ్డి విషయం తెలిశాక అతని ఫోన్ కాల్స్ పై నిఘా ఉంచారు. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన వారితో ఎక్కువగా మాట్లాడినట్లు గుర్తించారు. వారిని అరెస్టు చేసి దర్యాప్తు చేయగా వాస్తవాలు బయటకొచ్చాయి. నలుగురు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్​కు పంపించారు.

ఇదీ చూడండి:గ్రేటర్‌ ఎన్నికల కోసం వెళ్తున్న బస్సు ఢీ కొని వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details