తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పోలీసు స్టేషన్ నుంచి పరారైన దొంగ - చోరీ

పోలీసు స్టేషన్ నుంచి దొంగ పరారైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో చోటుచేసుకుంది. పరారైన దొంగ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసు సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పరారైన దొంగను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

పోలీసు స్టేషన్ నుంచి పరారైన దొంగ
పోలీసు స్టేషన్ నుంచి పరారైన దొంగ

By

Published : Oct 28, 2020, 5:38 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లోని రత్ననగర్ కాలనీలో కూరగాయల వ్యాపారి ముసర్ పాషా ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగ చోరీకి యత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

వెంటనే దొంగను స్టేషన్​కు తరలించి విచారణ చేయగా.. ఏపీలోని కడప జిల్లాకు చెందిన మహ్మద్ రఫి అని తెలిసింది. నిందితుడి నుంచి ఒక ద్విచక్ర వాహనం, చరవాణి స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ రఫి మూత్రం వస్తుందని చెప్పటం వల్ల అతనితో ఒక పోలీసు​ను వెంట పంపారు. పోలీసును తోసేసి.. నిందితుడు పారిపోయాడు.

ఈ విషయంపై పోలీసు అధికారులు స్పందిస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పరారైన దొంగను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

ఇదీ చదవండి:మంటలు చెలరేగి నాలుగు స్కూలు బస్సులు దగ్ధం

ABOUT THE AUTHOR

...view details