ఒత్తిడి తట్టుకోలేక ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ ఉపాధ్యాయుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందిరానగర్‌లో నివాసం ఉండే.. కోదండ రామయ్యశెట్టి విడపనకల్లు మండలం హంచనహాల్‌లో ప్రధానోపాద్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఆయన గంతకల్లు రైల్వే జంక్షన్ వద్ద ట్రాక్‌పై శవమై ఉన్నారు.
పనిభారం తట్టుకోలేక ఉపాధ్యాయుడు ఆత్మహత్య - Teacher commits suicide in Guntakal
పని ఒత్తిడిని అధిగమించలేక ఓ ఉపాధ్యాయుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఆయన శవమై తేలారు. తమకు ఎలాంటి సమస్యలు లేవనీ... పని ఒత్తిడి వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారని మృతుని భార్య ఆవేదన వ్యక్తం చేశారు.
పనిభారం తట్టుకోలేక ఉపాధ్యాయుడు ఆత్మహత్య
ఇది గమనించిన రైల్వే పోలీసులు... కేసు నమోదు చేసి అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తమకు ఎలాంటి సమస్యలు లేవని... ఏపీ ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు పనుల ఒత్తిడి ఎక్కువగా ఉండేదని చెబుతుండేవాడని.... మృతుడి భార్య రాధ రత్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి జేబులో లభించిన సూసైడ్ నోట్‌లో ఏముందనేది పోలీసులు ఇంకా వెల్లడించలేదు.
ఇదీ చదవండి:ట్రాన్ఫ్ఫార్మర్ పట్టుకుని బతికాడు..! ఉరేసుకుని చనిపోయాడు..!!