హైదరాబాద్ పాతబస్తీలోని పలు పతంగుల దుకాణాలపై టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించింది. మీర్ చౌక్, కాలా పత్తార్ పోలీస్స్టేషన్ పరిదిలోని మూడు షాపుల నుంచి భారీగా ప్రభుత్వ నిషేధిత చైనా మాంజాను స్వాధీనం చేసుకుంది.
'చైనా మాంజా అమ్మినా, కొన్నా నేరమే' - పతంగులు
హైదరాబాద్ పాతబస్తీలో చైనా మాంజా అమ్ముతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ నిషేధిత చైనా మాంజాల అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చైనా మాంజా అమ్మినా, కొన్నా నేరమే
అనంతరం పోలీసులు పతంగుల దుకాణాల యజమానులపై కేసు నమోదు చేశారు. చైనా మాంజా వల్ల పక్షులకు ప్రమాదమంటూ.. ప్రజలెవరూ వాటిని కొనకూడదని కోరారు.
ఇదీ చదవండి:'సంక్రాంతి గిఫ్ట్.. 'మద్యం' రూపంలో మళ్లీ సర్కారుకే'