తెలంగాణ రాష్ట్రం ఖమ్మం సమీపంలోని మానుకొండ గ్రామానికి చెందిన ఉష, ప్రసాద్‌లు దంపతులు. వీరు తాపీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. వారికి ఇద్దరు పిల్లలు సుకుమార్ (4), అంకిత్ (18నెలలు)ఉన్నారు. ఉషకు కొణిజర్ల మండలం రామనర్సానగర్‌కు చెందిన సంపంగి శ్రీను అలియాస్ శివతో పనులు చేసే చోట పరిచయం ఏర్పడింది.
అతనికి గతంలోనే వివాహమైంది..ఆమె భర్తను, అతడు భార్యను వదిలేసి ఇద్దరూ రెండు నెలల క్రితం జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామం వచ్చి అక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. పిల్లలు ఇద్దరూ వారి వద్దే ఉంటున్నారు. ఈ నెల 4వ తేదీన రాత్రి పిల్లలు అల్లరి చేస్తున్నారని ఆగ్రహానికి గురై ప్రియుడితో కలిసి తీవ్రంగా కొట్టింది. ఆ దెబ్బల దాటికి అంకిత్‌కు మూర్ఛ వచ్చి పడిపోయి కొద్దిసేపటికి మృతి చెందాడు. పిల్లలకు జ్వరం వచ్చింది..ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని స్థానికులతో నమ్మబలికి పిల్లలతో కలిసి ఇద్దరూ ఆటోలో బయలుదేరారు.
యజమాని ఆరాతో :
ఆ ఇద్దరూ మరుసటి రోజు కూడా తిరిగి రాకపోవడంతో ఇంటి యజమానికి వారిపై అనుమానం వచ్చింది. స్థానిక వీఆర్వోతోపాటు, పోలీసులకూ సమాచారమిచ్చారు. ఈ మేరకు చిల్లకల్లు ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేట్టారు.