రంగారెడ్డి జిల్లా శంకరపల్లి శ్రీరామ్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. యాదయ్య అనే వ్యక్తి తన తండ్రి అంజయ్యను నరికి చంపాడు. అనంతరం తలుపులు మూసేసి.. ఇంట్లోనే తిరుగుతున్నాడు.
దారుణం: తండ్రిని నరికి చంపిన కుమారుడు - rangareddy district crime news
20:19 October 01
దారుణం: తండ్రిని నరికి చంపిన కుమారుడు
అంజయ్య స్థానికంగా వెదురు బొంగులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య నెల రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. కుమారుడు యాదయ్య హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో యాదయ్య గత 15 రోజుల నుంచి తండ్రి వద్ద పనికి వస్తున్నాడు. ఈ క్రమంలోనే నిద్రిస్తున్న అంజయ్యను కత్తితో నరికి చంపాడు. అనంతరం చుట్టుపక్కల వారు కిటికీలోంచి ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని ఇంట్లోని లైట్లను ఆర్పేసి కూర్చున్నాడు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు యాదయ్యను ఇంట్లో నుంచి బయటకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. యాదయ్యకు మానసిక పరిస్థితి సరిగా లేదని స్థానికులు తెలిపారు.