తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఏటీఎం చోరీ చేస్తుండగా లైవ్​లోనే దొరికేశారు - ameenpur latest News

సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో హెచ్​డీఎఫ్​సీ ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి ఇద్దరు దుండగులు గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎం యంత్రాన్ని పగలగొట్టి నగదు దొంగిలించేందుకు విఫలయత్నం చేశారు.

ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులు.. ఘటనా స్థలిలోనే అరెస్ట్
ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులు.. ఘటనా స్థలిలోనే అరెస్ట్

By

Published : Sep 3, 2020, 12:33 PM IST

Updated : Sep 3, 2020, 5:00 PM IST

సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో హెచ్​డీఎఫ్​సీ ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులను ఘటనా స్థలంలోనే పోలీసులు పట్టుకున్నారు. గత రాత్రి ఇద్దరు దుండగులు గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎం యంత్రాన్ని పగలగొట్టి నగదు దొంగిలించేందుకు ప్రయత్నించారు. ఏటీఎం మిషన్​ను పగలగొట్టే సమయంలో పోలీసులకు సమాచారం అందింది.

ఘటనా స్థలంలోనే...

వెంటనే స్పందించిన అమీన్​పూర్​ పోలీసులు కిష్టారెడ్డిపేట్ పరిధిలోని హెచ్​డీఎఫ్​సీ ఏటీఎంకు చేరుకున్నారు. అనంతరం ఘటనా స్థలంలోనే నిందితులను రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ఆ సమాచారం గోప్యం..

నిందితులను అదుపులోకి తీసుకున్న సమాచారాన్ని పోలీసులు రహస్యంగా ఉంచారు. ఇటీవలే పటాన్​చెరు ప్రాంతంలోని ఎస్​బీఐ సహా ఇతర ఏటీఎంల్లో చోరీ యత్నాలు పెరిగాయి.

ఆ కోణంలోనూ దర్యాప్తు...

ఈ నేపథ్యంలో ఆయా ఏటీఎంల నిందితులకు ఏమైనా సంబంధాలున్నాయా... అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితులను రహస్య ప్రదేశంలో అమీన్​పూర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఏటీఎం చోరీ చేస్తుండగా లైవ్​లోనే దొరికేశారు

ఇవీ చూడండి : భాగ్యనగరంలో తొలి లైవ్ ఫిష్​మార్ట్

Last Updated : Sep 3, 2020, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details