తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కొల్లాపూర్​లో పేలుడు.. ఒకరికి స్వల్ప గాయాలు - నాగర్ కర్నూలు జిల్లా

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు ముడిపదార్థం పేలింది.​ ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి.

The raw material accidentally exploded in a house in Kolhapur zone of Nagar Kurnool district
కొల్లాపూర్​లో పేలుడు..ఒకరికి స్వల్ప గాయాలు

By

Published : Jan 11, 2021, 11:09 AM IST

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం బోడబండలో జిలెటిన్​స్టిక్ ముడిపదార్థం పేలింది. ఈ ఘటనలో ఒకరు స్వల్పంగా గాయపడగా.. ఓ ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది.

గ్రామానికి చెందిన జానకమ్మ నెల క్రితం వంట చెరకు కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సమీపంలోని ఓ మూసివేసిన కంపెనీ వద్ద.. కట్టెలతో పాటు కొన్ని వైర్లను ఇంటికి తీసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం వంట చేసిన అనంతరం.. పొయ్యిలో నుంచి మిగిలిన కట్టెలు తీసి ఇంటిబయట వైర్లు ఉన్న చోట వేసింది. ఆ కొద్ది సేపటికే ముడిపదార్థం భారీ శబ్దంతో పేలింది.

ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న ఇంటి యజమాని మహేశ్​కు స్వల్ప గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం కొల్లాపూర్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:గ్యాస్​ పేలుడు ఘటనలో ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details