వరంగల్ అర్బన్ జిల్లా మడికొండకు చెందిన 58 సంవత్సరాల వయసు ఉన్న నిబ్బుల కొమురమ్మకు 3 రోజుల నుంచి తీవ్ర జ్వరం ఉంది. ఆమెను బంధువులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే వైద్యులు అరగంట చికిత్స చేసి రోగి పరిస్థితి విషమించిందని.. ఎంజీఎంకు తీసుకెళ్లాలని సూచించారు.
ఆస్పత్రి ముందు మృతురాలి బంధువుల ఆందోళన
వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి చెందారంటూ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పూల కుండీలను పగుల గొట్టారు.
ఆస్పత్రి ముందు మృతురాలి బంధువుల ఆందోళన
బంధువులు తీసుకెళ్లేలోపే కొమురమ్మ చనిపోయింది. ఆస్పత్రి యాజమాన్యం డబ్బులు కట్టించుకొని చికిత్సను ఆలస్యం చేయడం వల్లే రోగి చనిపోయిందని బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. పూల కుండీలను పగుల గొట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని శాంతింపజేశారు.
ఇదీ చదవండి:రుణ యాప్‌ల వ్యవహారంలో మరో ముగ్గురి అరెస్టు