తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే - మహబూబాబాద్ జిల్లా వార్తలు

చెరువులో పడి మృతి చెందిన నలుగురు చిన్నారుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శంకర్​ నాయక్​ ఓదార్చారు. మహబూబాబాద్ జిల్లా శనిగపురం శివారు బోడ తండాకు చెందిన దినేశ్​, బోడ జగన్, ఇస్లావత్ రాకేశ్​, ఇస్లావత్ లోకేశ్​ చేపల వేటకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయారు.

The MLA, who has visited the families of the deceased in mahabubabad
మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే

By

Published : Jul 4, 2020, 10:22 PM IST

మహబూబాబాద్ జిల్లా శనిగపురం శివారు బోడ తండాకు చెందిన దినేశ్​, బోడ జగన్, ఇస్లావత్ రాకేశ్​, ఇస్లావత్ లోకేశ్​ చేపల వేటకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక డీఎస్పీ నరేశ్​ కుమార్ తన సిబ్బందితో కలిసి తండాకు చేరుకొని విచారణ చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ తండాకు చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. నాలుగు కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తండాకు చెందిన పాప అనే వ్యక్తి అనారోగ్యంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండాకు చెందిన ఐదుగురు ఒకే రోజు చనిపోవడం వల్ల విషాద ఛాయలు అలుముకున్నాయి.

మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details