పిడుగు పడి ముగ్గురు కాపర్లు, 40 గేదెలు మృత్యువాత - పశు కాపర్ల మృతి వార్తలు భూపాలప్లలి జిల్లా
19:57 October 10
పిడుగుపడి ముగ్గురు కాపర్లు, 40 గేదెలు మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో పిడుగుపాటుతో ముగ్గురు కాపర్లు దుర్మరణం చెందారు. ఇదే ఘటనలో 40 గేదెలు కూడా చనిపోయాయి. సాయంత్రం నుంచి జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. టేకుమట్ల మండలం.. కుందనపల్లి గ్రామంలో పిడుగుపడి గొర్రెల కాపరి సారయ్య అక్కడికక్కడే చనిపోగా.. గరిమెళ్లపల్లి గ్రామ శివారులోని జిలుకల గుట్ట వద్ద పశు కాపర్లు కొమురయ్య, నరేష్ మృత్యువాత పడ్డారు.
ఈ ఘటనలో 30 గేదెలు కూడా చనిపోయాయి. దీంతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అలాగే ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఒంటిమామిడి గ్రామంలోనూ పిడుగుపాటుకు 9 మేకలు చనిపోయాయి. పశువుల కాపరికి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ మేకలు ఎంపీపీ సతీశ్‌కు చెందినట్లుగా తెలుస్తోంది.
ఇదీ చదవండి:పిడుగు పడి కుమార్తె మృతి.. విషమంగా తండ్రి పరిస్థితి