జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఓ రైతు ఖాతా నుంచి తన ప్రమేయం లేకుండా డబ్బు విత్ డ్రా అయింది. మానవపాడు మండలం చేన్నిపాడుకు చెందిన సోమశేఖర్ ఇటీవల పత్తి పంటను విక్రయించారు. ఈ నెల 26న తన ఖాతాలో రూ. 2,77,000 జమ అయ్యాయని చరవాణికి సందేశం వచ్చింది.
రైతు ఖాతా నుంచి డబ్బు మాయం చేసిన సైబర్ నేరగాళ్లు - cyber crime in Jogulamba Gadwal Distric
ఓ రైతు ఖాతా నుంచి తన ప్రమేయం లేకుండా డబ్బు విత్ డ్రా అయినా ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రైతు ఖాతా నుంచి డబ్బు మాయం చేసిన సైబర్ నేరగాళ్లు
బ్యాంకు వెళ్లి ఆరా తీయగా మూడు నిముషాలు వ్యవధిలో 21 సార్లు డబ్బు డ్రా అయినట్లు తేలింది. శేఖర్‌కు పది నెలల క్రితం మానవపాడు ఎస్‌బీఐ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామంటూ ఏటీయం పిన్ నంబర్ చెప్పాలని అడగటంతో చెప్పినట్లు తెలిపారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:యూపీలో కిసాన్ మహాపంచాయత్- వేల మంది హాజరు