భార్యభర్తల మధ్య గొడవ కాస్తా ప్రాణాలమీదికి తెచ్చింది. క్షణికావేశం మహిళ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లి ప్రేమను దూరం చేసింది. డబ్బులు ఇవ్వలేదని భార్యను సైకిల్ పంపుతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిల్లాపురంలో ఈ ఘటన జరిగింది.
క్షణికావేశంలో భార్యను హతమార్చిన భర్త - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు
క్షణికావేశం నిండు ప్రాణాలను బలితీసుకుంది. భార్యభర్తల జరిగిన గొడవ ఇంటిదీపాన్నే ఆర్పేసింది. డబ్బుల కోసం భార్యతో తగాదా పడి... ఏకంగా ఆమె ఊపిరి తీసేశాడు భర్త. సైకిల్ గాలిపంపుతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మహిళ మృతి చెందింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామంలో జరిగింది.
క్షణికావేశంలో భార్యను హతమార్చిన భర్త
చిల్లాపురానికి చెందిన ఈశ్వర్‌కు కేసారం గ్రామానికి చెందిన సంతోషతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరికి కుమారులు. భార్యభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. పోలీసులు అతనికి చాలాసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.