రాష్ట్రంలో పరువు హత్యలు ఆగడం లేదు. హైదరాబాద్ చందానగర్‌కు చెందిన హేమంత్(26) అదే ప్రాంతానికి చెందిన అవంతి(23) గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు 2020 జూన్ 11న కుత్బుల్లాపూర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రార్ పెళ్లి చేసుకున్నారు. అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఈ విషయమై చందానగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. ఇరుకుటుంబాలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అవంతి తన భర్తతో ఉంటానని చెప్పారు. అప్పటి నుంచి వీరిద్దరు గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో ఉంటున్నారు. రోజు అవంతి వారి తల్లిదండ్రులు, బంధువులతో ఫోన్లో మాట్లాడుతున్నారు.
యువతి ప్రేమ పెళ్లి.. పరువు కోసం ఆమె భర్త హత్య
14:12 September 25
యువతి ప్రేమ పెళ్లి.. పరువు కోసం ఆమె భర్త హత్య
08:46 September 25
యువతి ప్రేమ పెళ్లి.. పరువు కోసం ఆమె భర్త హత్య
బలవంతంగా లాక్కెళ్లారు
ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో అవంతి వారి తల్లిదండ్రులు, బంధువులు మూడు కార్లలో వచ్చి అవంతి, హేమంత్‌ను బలవంతంగా లాక్కెళ్లారు. గోపాన్‌పల్లి పోయేసరికి అవంతి, హేమంత్ తప్పించుకున్నారు. అమ్మాయి మేనమామ యుగంధర్ రెడ్డి హేమంత్‌ను పట్టుకుని కారులో ఔటర్ రింగ్ వైపు తీసుకెళ్లారు. సమాచారమందుకున్న పోలీసులు సాయంత్రం 5 గంటల వరకు తొమ్మిది మంది నిందితులను పట్టుకున్నారు. యుగంధర్ రెడ్డి ఫోన్ స్విచ్ చేయడం వల్ల అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో యుగంధర్ రెడ్డి షామీర్పేట వద్ద అదుపులోకి తీసుకున్నారు.
ఉరేసి హత్య
అతన్ని విచారించగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కిష్టయ్యగూడెం గ్రామ శివారులో హేమంత్ గొంతుకు ఉరేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హేమంత్ మృతదేహాన్ని తెల్లవారుజామున ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. కూతురు ప్రేమ వివాహం ఇష్టం లేని లక్ష్మారెడ్డే హత్య చేయించారని హేమంత్ తల్లిదండ్రులు ఆరోపించారు.