తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వ్యవసాయ భూమిలో విద్యుదాఘాతం.. రైతు మృతి - farmer died with current shock

కరెంట్​షాక్​కు గురై ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో జరిగింది.

The farmer died on the spot due to electric shock at suryapet district
కరెంట్​ షాక్​ కొట్టి రైతు అక్కడికక్కడే మృతి

By

Published : Jan 2, 2021, 7:52 PM IST

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో విషాదం చోటుచేసుకుంది. అర్వపల్లికి చెందిన రైతు బైరబోయిన సంజీవ(52) తనకున్న వ్యవసాయ భూమిలో పని చేస్తున్నాడు. ఆ క్రమంలో మోటార్ స్టార్టర్ ఆన్ చేసే క్రమంలో విద్యుదాఘాతం సంభవించి మరణించాడు.

పొలంలో పనిచేస్తున్న మృతుని కుమారుడు తండ్రి పడిపోవడాన్ని గమనించాడు. కానీ అప్పటికే తన తండ్రి మృతి చెందాడు. మృతునికి ఓ కుమారుడు, ముగ్గురు కూమార్తెలు ఉన్నారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.

ఇదీ చూడండి :ఇల్లు కట్టించి మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎస్ఐ

ABOUT THE AUTHOR

...view details