తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రమేశ్ హత్యకు ఆ బంధమే కారణం: డీసీపీ - పెద్దపల్లి జిల్లా తాజా వార్తలుట

ఈ నెల 18న హత్యకు గురైన రమేష్ అనే యువకుని హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పెద్దపల్లి డీసీపీ పేర్కొన్నారు. పథకం ప్రకారమే నిందితులు హత్యకు పాల్పడినట్లు వెల్లడించారు.

the-extramarital-affair-reason-for-the-murder
వివాహేతర సంబంధమే దారుణహత్యకు దారి తీసింది

By

Published : Dec 21, 2020, 10:55 PM IST

వివాహేతర సంబంధమే యువకుని దారుణహత్యకు దారి తీసిందని పెద్దపల్లి డీసీపీ రవీందర్ పేర్కొన్నారు. హత్యకు పాల్పడ్డ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. పోలీసుల కథనం ప్రకారం..

ధర్మారం మండలం నందిమేడారం గ్రామానికి చెందిన రమేష్.. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మద్దిరాల శివారులో ఈ నెల 18న రమేశ్ దారుణ హత్యకు గురయ్యాడు. తన బంధువుల ఇంటికి రమేష్​ వచ్చాడన్న విషయం తెలుసుకున్న సదరు మహిళ కుటుంబ సభ్యులు.. అతడిని హతమార్చాలనే ఉద్దేశంతో అదే రోజు పోతురాజుల రాజు, శ్రీను, వేణు కారులో మద్దిరాలకు వచ్చారు. పొలంలో పనిచేస్తున్న రమేశ్​పై కత్తులతో దాడి చేసి అతి దారుణంగా హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి కారుతో పాటు హత్యకు ఉపయోగించిన రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:విద్యార్థిని అదృశ్యం: మౌఖిక ఎటెళ్లినట్టు.. ఏమైనట్టు?

ABOUT THE AUTHOR

...view details