కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. డబ్బుల కోసం తల్లిని కుమార్తె హత్య చేసింది. బిచ్కుంద మండలం దౌల్తాపూర్ గ్రామంలో తల్లిని కూతురు హత్య చేసినట్లు సీఐ సాజిద్ తెలిపారు. గతంలో ఇచ్చిన అప్పు తీర్చాలంటూ తల్లి, కూతురు గొడవ పడినట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు. మాటామాటా పెరిగి బండరాయితో మోది తల్లిని చంపినట్లు పోలీసులు తెలిపారు.
డబ్బు కోసం తల్లినే చంపేసిన కూతురు - crime updates in kamareddy
ఓ తల్లి తన కూతురు దగ్గరే అప్పు చేసింది. కానీ అప్పు తీర్చలేకపోయింది. కూతురు ఆ డబ్బు కావాలని అడిగింది. తల్లి తన దగ్గర డబ్బు లేదని.. కట్టలేనని చెప్పింది. మాటామాటా పెరిగింది. కూతురు ఆవేశంతో రగిలిపోయింది. బండరాయితో మోది తన తల్లిని చంపేసింది. ఈ అమానవీయ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
డబ్బు కోసం తల్లినే చంపేసిన కూతురు