మహబూబ్ నగర్ జిల్లా ఓబ్లాయపల్లి తండాలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మూడు రోజుల క్రితం జరిగిన వివాహ వేడుకలో వివాదం కారణంగా ఓ ఇంటిపై కొంతమంది దాడికి దిగారు. ఆ ఇంట్లో ఉన్నవారిపై కర్రలు, కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఇందులో ముగ్గురుకి తీవ్ర గాయాలవ్వగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహ వేడుకలో వివాదం.. విచక్షణారహితంగా దాడి - mahabubnagar latest news
ప్రశాంతంగా ఉండే తండా ఒక్కసారిగా రణరంగమైంది. వివాహ వేడుకలో తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరువర్గాల దాడిలో ముగ్గురికి తీవ్రగాయాలవ్వగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
వివాహ వేడుకలో వివాదం.. విచక్షణారహితంగా దాడి