తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విషాదం: అదుపు తప్పి కారు బోల్తా... వ్యక్తి దుర్మరణం - road accident kalwarala

పండుగ పూట కారు బోల్తా పడి వ్యక్తి మరణించిన ఘటన వనపర్తి జిల్లా కల్వరాలలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

విషాదం: అదుపు తప్పి కారు బోల్తా... వ్యక్తి దుర్మరణం
విషాదం: అదుపు తప్పి కారు బోల్తా... వ్యక్తి దుర్మరణం

By

Published : Jan 15, 2021, 8:48 PM IST

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల సమీపంలో అదుపుతప్పి కారు బోల్తాపడి ఒకరు మృతిచెందారు. ఐదుగురికి గాయాలయ్యాయి. కల్వరాలకు చెందిన బాల​నారాయణ అతడి కుటుంబ సభ్యులు బంధువుల ఊరు వెంకటాపురం వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో బాలనారాయణ అక్కడికక్కడే మరణించాడు. కారులో ఉన్న అతడి భార్య అలివేలు, పిల్లలు నందిని, జ్ఞానేశ్వరి, బావమరుదులు రఘు, శేఖర్​లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:తలుపులు తెరవలేదని ఇల్లు తగలబెట్టిన తాగుబోతు

ABOUT THE AUTHOR

...view details