తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కాసేపైతే క్షేమంగా ఇంటికి.. కానీ కారు అదుపు తప్పింది..! - సంక్రాంతి పండుగ

వేగంగా వస్తున్న ఓ కారు, లారీని తప్పించబోయి బురద పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో చోటుచేసుకుంది.

The car lost control and crashed into the fields in mahabubabad
కారు అదుపు తప్పింది.. పొలాల్లోకి దూసుకెళ్లింది

By

Published : Jan 14, 2021, 9:27 AM IST

కారు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.

వేగంగా వస్తున్న కారు, లారీని తప్పించబోయి బురద పొలంలోకి దూసుకెళ్లింది. మండలంలోని సంధ్య తండాకు చెందిన బాధితులు.. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తున్నారు. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:వాటర్ ట్యాంక్​ను ఢీ కొట్టిన కారు.. విశ్రాంత ఎస్సై దంపతులకు గాయాలు

ABOUT THE AUTHOR

...view details