తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కారులో చెలరేగిన మంటలు... తప్పిన ప్రాణనష్టం - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కారు పూర్తిగా దగ్ధమైంది.

the-car-burned-on-national-highway-at-kyasamballi-village-in-kamareddy-district, కారులో మంటలు
కారులో చెలరేగిన మంటలు... తప్పిన ప్రాణనష్టం

By

Published : Jan 8, 2021, 1:31 PM IST

హైదరాబాద్-కామారెడ్డి జాతీయ రహదారిపై ఓ కారు దగ్ధమైంది. కామారెడ్డి మండలం క్యాసంపల్లి శివారులో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సిద్దిపేట జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన స్వామి, సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్​లు కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తమ బంధువుని పలకరించి కారులో హైదరాబాద్ వైపు బయలుదేరారు.

కారులో చెలరేగిన మంటలు... తప్పిన ప్రాణనష్టం

క్యాసంపల్లి శివారులో కారు నెమ్మది అవడంతో పాటు ఒక్కసారిగా వెనుకబాగం నుంచి మంటలు చెలరేగాయని బాధితులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న స్వామి, శ్రీనివాస్​లు వెంటనే అప్రమత్తమై బయటకు దిగినట్లు వివరించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కారు పూర్తిగా దగ్ధమైందని పోలీసులు వెల్లడించారు. పెట్రోలింగ్ ఎస్సై ప్రభాకర్ అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.

ఇదీ చదవండి:మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

ABOUT THE AUTHOR

...view details