సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు కొన్ని ప్రవీణ్ రెండో కుమారుడు కార్నె వరుణ్... బిక్కేరువాగులో బుధవారం గల్లంతైన విషయం విధితమే. గ్రామస్థులు గురువారం విక్కేరువాగులో గాలించినా బాలుడి ఆచూకి దొరకలేదు.
ఇంకా లభించని బాలుడి ఆచూకీ - etv bharat
వాగులో పడి బాలుడు గల్లంతైన ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాములలో జరిగింది. రెండు రోజుల నుంచి పిల్లాడి ఆచూకీ కోసం గాలిస్తున్నా ఇంకా లభించలేదు.

ఇంకా లభించని బాలుడి ఆచూకీ
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, మోహన్ కుమార్‌తో కలిసి బిక్కేరువాగును పరిశీలించారు. బాలుడిని వెతికేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: కార్మిక ఆత్మబంధువుకు కడసారి వీడ్కోలు... నేతల ఘననివాళి