తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పిల్లర్ కారణంగా బాలుడు మృతి - boy died due to the pillar at danavaipeta

ఓ బాలుడు ఇంటి ఆవరణలో పిల్లర్​కు ఉన్న తాడును పట్టుకుని హాయిగా ఆడుకుంటున్నాడు. అదే క్రమంలో ఆకస్మాత్తుగా పిల్లర్​ పిల్లాడిపై పడింది. అంతే బరువు ఎక్కువగా ఉండటంతో ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.

The boy died due to the pillar at danavaipeta bhadradri district
పిల్లర్ కారణంగా బాలుడు మృతి

By

Published : Dec 14, 2020, 3:15 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దానవాయి పేటలో ఆదివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ఇంటి ఆవరణలో నిర్మించిన పిల్లర్ విరిగిపడి ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు.

ఇంటి వెనుక ఆవరణలో నిర్మించిన పిల్లర్​కు ఉన్న తాడును పట్టుకుని పిల్లాడు వేలాడగా.. పిల్లర్ విరిగి మీద పడడంతో బాలుడు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఇదీ చూడండి :గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు మహిళలు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details