తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గల్లంతైన మృతదేహాన్ని వెలికితీసిన గజఈతగాళ్ల బృందం - Godavari bridge latest News

ఈ నెల ఒకటో తేదీన పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని వద్ద గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. పట్టణ రెండో టౌన్ సీఐ సూచన మేరకు నిండు గోదావరిలో బెస్తపల్లి గజ ఈతగాళ్ల బృందం గాలింపులు చేపట్టింది. ఈ క్రమంలో సుందిళ్ల బ్యారేజీ వద్ద బృందం మృతదేహాన్ని గుర్తించింది.

గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

By

Published : Oct 4, 2020, 2:45 AM IST

Updated : Oct 5, 2020, 1:30 AM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని స్థానిక హనుమాన్​నగర్​కు చెందిన 18 ఏళ్ల యువకుడు ఈ నెల ఒకటో తేదీన రాత్రి గోదావరిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పట్టణ రెండో ఠాణా సీఐ శ్రీనివాస్ మంథని మండలం బెస్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గంగపుత్ర గజ ఈతగాళ్ల సొసైటీకి సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న గజ ఈతగాళ్ల బృందం గాలింపు చర్యలు చేపట్టింది. నిండు గోదావరిలో ముమ్ముర గాలింపుల అనంతరం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మంచిర్యాల జిల్లా జైపూర్ మండల శివారులోని సుందిళ్ల బ్యారేజీ వద్ద మృతదేహం లభ్యమైంది.

గాలింపు చర్యల్లో కునారపు వెంకటేశ్ గంగపుత్ర, కునారపు లక్ష్మణ్ గంగపుత్ర, ఉమ్మడి గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ బోరే లింగయ్య గంగపుత్ర, గుమ్ముల రాజేశం గంగపుత్ర, పల్లికొండ క్రాంతి గంగపుత్ర పాల్గొన్నారు.

ఇవీ చూడండి : కృష్ణా నదిలో నలుగురు గల్లంతు.. ఒకరు మృతి

Last Updated : Oct 5, 2020, 1:30 AM IST

ABOUT THE AUTHOR

...view details