తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం - గొండ్యాలలో వాగులో వ్యక్తి మృతి

మహబూబ్ నగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జిల్లా పరిధిలోని అనేక చెరువులు అలుగులు పారి.. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. హన్వాడ మండలం గొండ్యాల గ్రామ సమీపంలోని వాగులో గల్లంతైన వ్యక్తి మృత దేహం లభ్యమైంది.

వాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
వాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

By

Published : Sep 27, 2020, 12:28 PM IST

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం గొండ్యాల గ్రామ సమీపంలోని వాగులో గల్లంతైన వ్యక్తి మృత దేహం లభ్యమైంది. హన్వాడ మండలం గొండ్యాల వాగులో కుర్వ రాములు శనివారం గల్లంతయ్యాడు. స్థానికులు, అధికారులు వాగులో వెతికేందుకు ప్రయత్నించిన సాధ్యం కాలేదు.

ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించాలని ఆదేశించారు. బృందాలు శనివారం రాత్రి గొండ్యాల గ్రామానికి చేరుకున్నా.. చీకటి, వర్షం కారణంగా వెతికేందుకు సాధ్యం కాలేదు. ఆదివారం ఉదయం వాగులో వెతకగా రాములు మృతదేహం లభ్యమైంది.

ఇదీ చూడండి: హన్వాడలో భారీ వర్షం.. వాగులో వ్యక్తి గల్లంతు

ABOUT THE AUTHOR

...view details