ప్రసవానికి ముందే కడుపులో బిడ్డ మృతి.. ఆసుపత్రి వద్ద ఆందోళన - The baby die before the delivery in nalgonda government hospital
10:51 June 04
ప్రసవానికి ముందే కడుపులో బిడ్డ మృతి.. ఆసుపత్రి వద్ద ఆందోళన
నల్గొండ జిల్లా కేంద్రంలోని.. ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. శిశువు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. చండూరు మండలం గట్టుప్పల్ గ్రామానికి చెందిన ప్రియాంక రెండు రోజుల క్రితం పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చారు. నిండుగర్భణి అయిన ప్రియాంకను వైద్యుల సూచన మేరకు.. ప్రసవానికి ఒకరోజు ముందే భర్త యాదయ్య ఆస్పత్రిలో చేర్పించారు.
రాత్రి 12 గంటల సమయంలో తన భార్యకు పురిటి నొప్పులు వచ్చినా.. ఎవరూ పట్టించుకోలేదని బాధిత కుటుంబం ఆరోపించింది. కడుపులోనే బిడ్డ చనిపోయిన తర్వాత.. ఇవాళ ఉదయం శస్త్రచికిత్స చేశారని బాధితురాలి భర్త వాపోయారు. చనిపోయిన బిడ్డను చేతిలో పెట్టిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధిత కుటుంబం బంధువులు ప్రభుత్వాసుపత్రి వద్ద నిరసన చెప్పాట్టారు.