మద్యానికి బానిసైన అల్లుడిని అత్తే హత్య చేసిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా నర్శంపేట మండలం రాములునాయక్ తండాలో జరిగింది. చెన్నారావుపేట మండలానికి చెందిన ఈరుకి రాములునాయక్ తండాకు చెందిన నరసమ్మతో 20ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్నేళ్లు బాగానే ఉన్నా...ఆ తరువాత ఈరు మద్యానికి బానిసగా మారాడు. ఏ పని చేయక...అత్త చిలుకమ్మ ఇంట్లో గత కొంతకాలంగా ఇల్లరికం ఉంటున్నాడు.
సహనం కోల్పోయిన అత్త.. కిరాతంగా అల్లుడి హత్య
మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజూ ఇంట్లో గొడవలు. తాగొచ్చి భార్యాపిల్లలను దూషించేవాడు. ఇది చూసి సహించలేకపోయింది ఓ అత్త. ఆవేశంతో అల్లుడిని రోకలి బండతో కొట్టి చంపేసింది. అనంతరం నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.
సహనం కొల్పోయిన అత్త.. కిరాతంగా అల్లుడిని హత్య
రోజూ తాగి రావడమే కాకుండా కొంతకాలం నుంచి వేధింపులకు కూడా గురిచేస్తున్నాడు. ఇది చూసి సహించలేని అత్త చిలుకమ్మ... అల్లుడు నిద్రిస్తుండగా రోకలిబండతో కొట్టింది. తీవ్ర రక్తస్రావమై ఈరు అక్కడిక్కడే మృతి చెందాడు. వెంటనే నేరుగా వెళ్లి నర్శంపేట పోలీసుల ఎదుట అత్త చిలుకమ్మ లోంగిపోయింది.
Last Updated : Dec 19, 2020, 9:19 AM IST