తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రెండోరోజూ సీఐ జగదీశ్​ ఇంట్లో ఏసీబీ సోదాలు - s Kamareddy CI Jagdish Latest News

కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్ ఇంట్లో అవినీతి నిరోదక శాఖ రెండోరోజూ సోదాలు నిర్వహించింది. బెట్టింగ్ కేసులో బెయిలు మీద విడుదల చేసేందుకు సుధాకర్ అనే వ్యక్తిని రూ.5లక్షలు డిమాండ్ చేయగా... బాధితుడి ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించింది.

రెండోరోజూ సీఐ జగదీశ్​ ఇంట్లో ఏసీబీ సోదాలు
రెండోరోజూ సీఐ జగదీశ్​ ఇంట్లో ఏసీబీ సోదాలు

By

Published : Nov 21, 2020, 6:03 PM IST

కామారెడ్డిలో రెండోరోజూ ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పట్టణ సీఐ జగదీశ్​ ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన తనిఖీలు రాత్రి 11 వరకు సాగాయి. బెట్టింగ్​ కేసులో ఓ వ్యక్తిని బెయిలు మీద విడుదల చేసేందుకు రూ.5 లక్షలు డిమాండ్​ చేసినట్లు ఫిర్యాదు రావడం వల్ల ఏసీబీ సోదాలు చేపట్టింది.

నిన్న రాత్రి తనిఖీలు పూర్తయిన తర్వాత సీఐ జగదీశ్​ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఉదయం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి కొవిడ్​, సాధారణ వైద్య పరీక్షల కోసం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. మొదటి రోజు పలు దస్త్రాలు, ఇతర ఆధారాలు లభించడంతో వరుసగా రెండో రోజు సీఐ జగదీష్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details